
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు పూర్తయిన ఏడు రోజుల వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఇవిఎం) నమోదైన ఓట్లతో వీవీ ప్యాట్ల స్లిప్పులను పరిశీలించుకోవడానికి అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత కూడా అభ్యర్థులకు ఏవైనా అనుమానాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసేలా ఎన్నికల సం ఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో ఈ వివరాలు పంచుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల కమిషన్ సమీక్ష నిర్వహించింది. తమిళనాడులోని 75,000 పోలింగ్ కేం ద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఇక్కడ నిర్వహించిన “సర్” ప్రక్రియ దేశానికి ఒక మో డల్‌గా నిలిచిందన్నారు.




