Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedవందరోజుల కార్యాచరణపై కేబినెట్ సబ్‌కమిటీ

వందరోజుల కార్యాచరణపై కేబినెట్ సబ్‌కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అమలు చేయాల్సిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశా లు ముగిసిన వెంటనే ఈ యాక్షన్ ప్లా న్‌ను ఖరారు చేసి అమలు దిశగా అడుగులు వేయనుంది. ఈ సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భ ట్టి విక్రమార్క మల్లు ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కమిటీ సభ్యులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీకి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి ఆర్థిక శాఖతో పాటు సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కమిటీ సమావేశాలకు హాజరవుతారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను కాలపరిమితిలో అమలు చేయడం లక్ష్యంగా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ను అత్యంత ప్రాధాన్యతతో రూపొందించి, వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే కమిటీ సమావేశమై అన్ని శాఖలతో సమీక్ష జరిపి వివరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనుంది.

వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి: సిఎస్

వచ్చే నెల 2 నుంచి జూన్ 9 వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతీ శాఖ తమ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణా రావు అన్ని శాఖల అధిపతులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే ఈ వంద రోజుల కార్యక్రమంలో అన్ని శాఖల వారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని సిఎస్ నిర్వహించారు. స్పెషల్ సి.ఎస్‌లు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సి.వీ ఆనంద్, సంజయ్ కుమార్ , మహేష్ దత్ ఎక్కా, సబ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్, దాన కిషోర్, అహ్మద్ నదీమ్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణా రావు మాట్లాడుతూ వంద రోజుల కార్యక్రమంపై ఈ నెల 28న నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.

మార్చి ఒకటిన జిల్లా కలెక్టర్ల సమావేశం

అలాగే మార్చి 1 ఆదివారం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చనీయాంశాలు వెంటనే రూపొందించాలన్నారు. ఈ సందర్బంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని, ఇందుకు గాను ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయితీ రాజ్, వ్యవసాయం, రెవెన్యూ, పర్యాటక, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, గృహనిర్మాణం, రెవెన్యూ, విద్యుత్, కార్మిక తదితర అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా, పారిశుద్ధం గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య తదితర కార్యక్రమాలపై నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహన చైతన్య కార్యక్రమాల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయంతోపాటు హెచ్.ఓ.డిలలో ఈ-ఆఫీస్ ను అమలు చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments