Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక బంధం

ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక బంధం

(మొదటి పేజీ తరువాయి)

ప్రస్తావనకు రాకుండా ఉన్న పలు రంగాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశలో ఇజ్రాయెల్‌లో మేలో జరిగే చర్చలతో తుది సంతకాలు కుదురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఎఫ్‌టిఎ పై ఇప్పుడు మొదటి దఫా చర్చలు పూర్తి అయ్యాయని వెల్లడించారు. . కాల పరీక్షకు నిలిచిన బంధం ఇప్పుడు ఎస్‌ఎస్‌పి (ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం) స్థాయికి చేరిందని ఇరుదేశాల నేతలు ప్రకటించారు. రెండు రోజుల పర్యటన తరువాత భారత్‌కు బయలుదేరి వచ్చే ముందు ప్రధాని మోడీ ఇజ్రాయెల్, అంతర్జాతీయ మీడియా వారితో మాట్లాడారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగవంతం చేయాలని నేతలు నిర్ణయించారు. ఇజ్రాయెల్ ప్రతిపాదిత గాజా శాంతి స్థాపన ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. ఘర్షణలకు . తూటాలకు మానవీయత బలి కారాదని పిలుపు నిచ్చారు.

మొత్తం 17 ఒప్పందాలు, కీలక పత్రాలపై సంతకాలు

భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక రంగాలకు సంబంధించి ఏకంగా మొత్తం 17 ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండే పత్రాలపై సంతకాలు జరిగాయి. ఏఐ, వ్యాపార వాణిజ్యాలు, పెట్టుబడులు , విద్యారంగం, ఉత్పత్తి, సాంస్కృతిక, మారిటైం హెరిటేజ్, వ్యవసాయం ఇతర పలు రంగాల్లో ఈ ఒప్పందాలు ఖరారు అయ్యాయి. మిడిలిస్టులో శాంతి సుస్థిరతలతో భారతదేశ భద్రతా అంశాలు ఇమిడి ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. గాజాలో ఘర్షణల అంతానికి సామరస్యపూర్వక పరిష్కారం దక్కాలని పిలుపు నిచ్చారు.

పౌర అణుఇంధన అంతరిక్ష రంగాల్లో విస్తరణ

రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత వేగవంతం అవుతుంది. ప్రత్యేకించి సైనిక హార్డ్‌వేర్ పరిపుష్టికి ఇజ్రాయెల్ సాయం తీసుకుంటారు. సాంకేతికత మార్పిడి పరిధిలో సంయుక్త రంగంలో ఉత్పత్తికి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకించి రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన రక్షణ సహకార భాగస్వామ్య ఒప్పందం ఖరారు కానుంది. రక్షణ రంగంలో సయుక్త ప్రాజెక్టులు, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతికత బదిలీ జరుగుతుందని ప్రధాని మోడీ తెలిపారు. పౌరుల ప్రయోజనాల దిశలో ఉండే అణుఇంధన రంగంలో , అంతరిక్ష ప్రయోగాలకు పరస్పరం కలిసినడుస్తాయి. ఇరుదేశాల నేతల చర్చలలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం, దీనితో తలెత్తుతున్న ముప్పు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎటువంటి సమస్యకు అయినా శాంతియుత సంప్రదింపులతోనే పరిష్కారం దక్కుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాకు తెలిపారు. ఈ విషయంలో అవసరం అయితే భారతదేశం నుంచి పూర్తి మద్దతు వెలువడుతుందని వివరించారు.

పూర్తి స్థాయి పరస్పర నమ్మికతో రెండు దేశాల సంబంధాల్లో పురోగతి నెలకొందని ప్రధాని మోడీ వివరించారు. కాలాతీత భాగస్వామ్యం ఇప్పుడు పరిపూర్ణ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం దిశకు సాగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇరుదేశాలు కలిసికట్టుగా పోరు సలుపుతాయని తెలిపారు. గాజా శాంతి ఒప్పందం శాంతికి దారితీసిందన్నారు. సాంకేతిక పరిణామాలు దేశాల భాగస్వామ్యానికి ప్రధాన కేంద్రబిందువులు అవుతాయి. దీనిని గుర్తించే ఏఐ , క్వాంటమ్, కీలక ఖనిజాల విషయంలో పరస్పర సహకారానికి ప్రక్రియను వేగవంతం చేస్తామని మోడీ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ సాంకేతిక వినిమయం జరుగుతుంది. భారతీయ సాగు అనుభవం ఇజ్రాయెల్ పంచుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తి రంగం విషయంలో నూతన టెక్నాలజీ వినియోగం జరుగుతుంది. సంబంధిత విషయంలో ఇప్పుడున్న నైపుణ్య కేంద్రాల సంఖ్యను వందకు పెంచుతామని ప్రధాని మోడీ మీడియాకు తెలిపారు.

నైపుణ్య గ్రామాల ఏర్పాటు.. ఇజ్రాయెల్ టెక్నాలజీ

గ్రామీణ ప్రాంతాలలో కోట్లాది మంది భారతీయ రైతుల కుటుంబాలకు ప్రయోజనం కల్గించేందుకు ఇజ్రాయెల్ సాయం తీసుకుంటారు. రైతాంగ ఆదాయం, పంట దిగుబడి పెంచేందుకు ఆదర్శ స్థాయిలో నైపుణ్య గ్రామాల ఏర్పాటు జరుగుతుంది. దీనితో భారత్‌లోని ప్రతి గ్రామానికి ఈ విషయంలో ఇజ్రాయెల్ సాంకేతికత చేరుతుంది. రైతులకు సరైన శిక్షణ కల్పిస్తారు. రైతుల ఆదాయం రెండింతలు చేయాలనే తమ సంకల్పానికి ఇజ్రాయెల్ సహకారంతో ఏర్పాటు అయ్యే ఈ గ్రామాలు ప్రాతిపదిక అవుతాయని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

పాలస్తీనియా విషయం ఏమిటీ?

ఇజ్రాయెల్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్న దశలో భారతదేశం బాధిత పాలస్తీనియన్ల పట్ల ఎటువంటి వైఖరితో ఉంటుందనే ప్రశ్న తలెత్తింది. విదేశాంగ కార్యదర్శి మిశ్రా ఈ మీడియా ప్రశ్నకు జవాబు ఇచ్చారు. అమెరికా ఆమోదిత గాజా శాంతి ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ఇస్తుందని వివరించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన ప్రకటనను గుర్తు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments