Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఐటిపై ఎఐ పిడుగు

ఐటిపై ఎఐ పిడుగు

న్యూఢిల్లీ : భారతదేశంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు విస్తరిస్తోన్న కృత్రిమ మేధ (ఏఐ) తీవ్ర ప్రబావం, మార్కెట్లలో గణనీయ స్థాయిలో ఈక్విటి అమ్మకాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ విషయాన్ని సిట్రిని రిస ర్చ్ నివేదికలో విశ్లేషించారు. అలాప్ షా సహరూపకల్పనలో ఈ నివేదిక వెలువడింది. ఇందులో ఐటి సెక్టార్‌కు ఏఐ నుంచి ముప్పు ఉందని తేల్చా రు. ఈ వారమే ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ కూడా వెలువడింది. ఏఐ భయాల తో భారీ స్థాయిలో ఐటి రంగ కంపెనీల అమ్మకాలు జరుగుతున్నాయని నివేదికలో తెలిపారు. 2028 గ్లోబల్ ఇంటలిజెన్స్ క్రైసిస్ పేరిట నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ భారతీయ కీలక రంగంగా ఉన్న ఐటి రంగానికి ఇప్పుడు రాబోయేవి ఇక అంతిమదినాలే (డూమ్స్‌డే) అని కూడా విశ్లేసణలో తెలిపారు. దేశంలోని అత్యున్నత ప్రతిభకు చాలాకాలంగా భారతీయ ఐటి రంగం వేదికగా, సరైన అవకాశాలకు గీటురాయిగా నిలుస్తూ వచ్చింది.ప్రపంచవ్యాప్త సేవల రంగం ద్వారా సృష్టి అ య్యే ఆర్థిక రంగం అత్యంత కీలకమైనది. ఇది భారతీయ ఐటి పరిశ్రమ కు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది.

ప్రత్యేకించి అధునాతన సంపన్న దేశాలు అయిన అమెరికా వంటి దేశాల కస్టమర్లకు తక్కువ ఖర్చుతో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందిస్తూ రావడం , దీనిపైనే ఐటి పరిశ్రమ ఎక్కువగా ఆధారపడి ఉండటం నిరంతర ప్రక్రియగా ఉంది. ఇతరదేశాల వేత న భత్యాలతో పోలిస్తే అతి తక్కువ స్థాయిలో ఐటి డెవలపర్స్‌కు భారతీ య సేవల ఐటి రంగం నుంచి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రక్రియ అందుతోంది. తీవ్ర ప్రభావవంతమైన ఏఐతో పరిస్థితి మారింది. వచ్చే సంవత్సరాంతానికి 200 బిలియన్ డాలర్లకు పై వరకూ భారతీయ ఆర్థిక రంగానికి ఏఐతో గండిపడుతుందని నివేదికలో హెచ్చరించారు. దీనితో రూపా యి 18 శాతం పడిపోతుంది. దీనితో భారతదేశం పరిస్థితిని తట్టుకునేందుకు ఐఎంఎఫ్‌తో ప్రాధమిక స్థాయిలో సమస్య పరిష్కారానికి (బెయిల్ ఔట్)కు చర్చలకు దిగాల్సి వస్తుందని తెలిపారు.ఇక 2028 నాటికి ఇప్ప టి భయాలు మరింతగా వాస్తవిక రూపం దాలుస్తాయి. ప్రముఖ కంపెనీలు అయిన ఇన్ఫోసిస్ , విప్రోలు ఇప్పటి భారతీయ ఐటి సాఫ్ట్‌వేర్ నిపుణుల ప్రతిభ సంబంధిత కాంట్రాక్టులను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందుకు బదులుగా కృత్రిమ మేధను వాడుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

ఏఐతో ప్లస్ ..మైనస్ లేదు

అంతా బాగుంటుందని విభిన్న వాదన

భారతీయ ఐటికి ఇటువంటి ముప్పు పరిస్థితి లేదని జెపి మోర్గాన్, హెచ్‌సిబిసి లకు చెందిన విశ్లేషకులు తెలియచేస్తున్నారు. సిట్రిని నివేదిక దశలో ఈ ఆశాజనక స్పందనలు వెలువడుతున్నాయి. ఏఐ ద్వారా ఫర్‌ఫెక్ట్ కోడ్ రూపకల్పన జరిగినా , వాటిని బారీ స్థాయి కార్పొరేట్ వ్యవస్థలోకి మలుచుకునేందుకు మానవ శక్తి, ప్రతిభగల నిపుణుల అవసరం ఉండనే ఉంటుందని తేల్చారు. నాస్కామ్ తాజా అంచనాల మేరకు 1.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తికి అవకాశం ఉందని వెల్లడైంది. ఏఐతో ప్రతిభాయుత పని వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.

ఏఐతో ఏదీ అంతం కాదని తెలిపారు. పైగా భారతీయ సంస్థల ద్వారా పలు ప్రాజెక్టులు మరింత వేగవంతంగా పూర్తి అయ్యేందుకు వీలేర్పడుతుందని విశ్లేషించారు. ఇదంతా కూడా మానవ ప్రతిభతో సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం గ్లోబల్ ఆర్ అండి డి కేంద్రం అవుతుందని ఆశాజనక విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. ఇప్పటికే భారతదేశం ఔట్‌సోర్సింగ్ పరిశ్రమపై పడే తీవ్ర ప్రభావాన్ని తట్టుకునేందుకు చర్యలు తీసుకుందని తేల్చారు. గ్లోబల్ కెపబులిటి సెంటర్స్(జిసిసి) ల ద్వారా ఈ ముప్పును నివారిస్తున్నారని. ఇటువంటి కేంద్రాలు 50 శాతానికి పైగా ఇండియాలో ఉన్నాయని, ఏఐ ముప్పును తట్టుకుని నిలబడగలిగే స్థాయిని శక్తిని సంతరించుకుంటున్నాయని కొన్ని విశ్లేషణలతో స్పష్టం అయింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments