Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరవకముందే ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది.సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పరిధిలోని సురభి ప్రైవేటు మెడికల్ కాలేజీ లో ఇటీవల కాలంలో జరిగిన వరుస సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత కొంత కాలంగా సురభి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో జరుగుతున్న సంఘటనలపై యాజమాన్యం తీరు చర్చానీయాంశంగా మారింది.రెండు రోజుల క్రితం కాలేజీ హాస్టల్లో ఫిజియోథెరపి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ శ్రీజ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన శవాన్ని మార్చురికి తరలించి చేతులు దులుపుకోవడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ శ్రీజను చదివిస్తుండగా హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడిన అందుకు కారణాల పై కళాశాల యాజమాన్యం నోరు మెదపక పోవడం అనుమనాలకు తావిస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే శ్రీజ ఆత్మహత్యకు పాల్పడిందనే కళాశాల యాజమాన్యం పేర్కొంటూ పోలీసులు విచారిస్తున్నారని చెప్పడాన్ని విద్యార్థి సంఘాలు మృతురాలి బందువులు తప్పు బడుతున్నారు.గతంలోనే ఒక మెడికో కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైతం సంచలనం సృష్టించినా యాజమాన్యం మాత్రం పట్టిపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం.

సురభీ మెడికల్ కాలేజీపై హెచ్చార్సీ ఆగ్రహం : సిద్ధిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యా సంస్థ పై హెచ్ ఆర్సీ ఛైర్మెన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన నాలుగు నెలల క్రితమే చోటుచేసుకుంది. సిద్ధిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో విద్యను అభ్యసించిన సమయంలో తాను సమర్పించిన ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లను కాలేజి యాజమాన్యం నిలిపివేయడంతో, తాను పీజీ ప్రవేశానికి గడువులోపు ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయలేకపోయానని డాక్టర్ మెరుగు కార్తిక్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ అతనికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అదేశించినప్పటికి, ఇవ్వకపోవడమే కాకుండా, కమిషన్ సమన్లకు కూడా హాజరు కానందన కాలేజ్ ఛైర్మన్, ప్రిన్సిపల్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ కి ఆదేశించింది.

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం : కొద్ది నెలల క్రితం సురభి మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయికృష్ణ అనే విద్యార్థిని అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ర్యాగింగ్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.మెడికో సాయికృష్ణ దేవుడి మొక్కు కోసం గడ్డం పెంచుకోవడం పై ర్యాగింగ్ చేస్తూ గడ్డం తీయించారు. ఈ విషయమై యాంటీ ర్యాగింగ్ కమిటీకి విద్యార్థి సాయికృష్ణ ఫిర్యాదుచేసిన యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థి ఏకంగా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని కొందరు విద్యార్థులపై కొద్ది కాలంపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంది..

అనుమతులు లేకుండా నిర్మాణాలు : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇరవై ఎకరాల్లో నిర్వహిస్తున్న సురభీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరపడంపై సామాజిక కార్యకర్త జి.చక్రధర్ గౌడ్ హై కోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఆర్డర్ ను జారీ చేసింది. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అనధికార నిర్మాణాలపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత ఉన్నతాధికారులకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

రాజకీయ అండదండలే కారణం…? : రాజకీయ అండదండలతోనే సురభీ మెడికల్ కాలేజీ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ విద్యార్థుల ఆత్మహత్యలైనా, ర్యాగింగ్ , అక్రమ నిర్మాణాల పై ఆరోపణలు వచ్చినా ఎలాంటీ చర్యలు లేక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఆరు నెలలుగా వరుస సంఘటలను చూస్తుంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షకులను తయారు చేసే మెడికల్ కాలేజీలో నిబందనలకు తూట్లు పోడుస్తున్నా అధికారులు చోద్యం చూడటం పట్ల పులువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘటనలపై మీడియాలో వార్తలు వచ్చినా అధికారులు చర్యలు చేపట్టక పోవడం రాజకీయ అండదండలే కారణమని భావిస్తున్నారు. ఏది ఏమైనా వరుస సంఘటనలపై అధికారులు విచారణ జరపాలనే డిమాండ్ విసృ్తతమవుతోంది.

ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు : మెడికల్ కళాశాల డిఎన్ డాక్టర్ రఫీ

సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని కళాశాల డిఎన్ మహమ్మద్ రఫీ తెలిపారు. విద్యార్థిని శ్రీజ ఆత్మహత్యకు సంబంధించిన వివరణ కోరగా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments