Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedపరీక్షా కాలం

పరీక్షా కాలం

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు పరీక్షల కాలం మొదలైంది. వి ద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్దమయ్యేందుకు ఇది అత్యంత కీల క సమయం. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, మరోవైపు ప్రవేశ పరీక్ష ల తేదీలూ దగ్గరపడుతుండటం విద్యార్థులకు సవాల్‌గా మారుతుంది. ఈ రెం డింటినీ సమతుల్యం చేసుకునేలా విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికలతో సన్నద్ధం కావడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కులే ప్రామాణికంగా ఇప్పటికే విద్యార్థులపై ఒత్తిడి మొదలైంది. పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

అధికారులు, పరీక్షలకు విద్యార్థులను సి ద్ధం చేసే దిశగా ప్ర త్యేక తరగతులు ని ర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగియ గా, ఈ నెల 25 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 9.91 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బంధీ గా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లక్షలా ది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంటర్,టెన్త్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది.

ఇంటర్మీడియేట్ ద్వితీ య సంవత్సరం చదివే సైన్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులు వార్షిక పరీక్షలతో పాటు జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్‌తో పాటు ఎప్‌సెట్, ప్రైవేట్ ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ విద్యార్థులు ఒక వైపు అకడమిక్ చదువులు కొనసాగిస్తూనే మరో వైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి జెఇఇ మెయిన్ పూర్తి కాగా, ఏప్రిల్‌లో 1 నుంచి 9 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ జరగనుంది. బైపిసి విద్యార్థులు నీట్‌తో పాటు ఎప్‌సెట్‌కు సన్నద్ధమవుతుంటారు. మే 3వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది. అయితే వార్షిక పరీక్షలకు సన్నద్దమవుతునే పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో రెండింటీని సమతుల్యం చేసుకుంటూ సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే, జూన్ నెలల్లో పలు పరీక్షలు జరగనున్నాయి. మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి. మే 4,5 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9,10,11 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. అదేవిధంగా మే 15న ఇసెట్, మే 18న లాసెట్, పిజిఎల్‌సెట్, మే 28,31 తేదీలలో పిజిఇసెట్, మే 12న ఎడ్‌సెట్, మే 13, 14 తేదీలలో ఐసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి.

ఒత్తిడిని అధిగమించాలి..

పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు ఉండటం సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం.. హడావుడిగా మాట్లాడటంతో డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోంవర్క్, పరీక్షల మార్కులపై ఒత్తిడి తెస్తే చాలా ప్రమాదం. ఒత్తిడితో బాధపడే వారు మతిమరుపునకు గురయ్యే అవకాశం ఉంది. సరిపడా నిద్ర, మంచి ఆహారం, ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి. –

నిద్ర ఎంతో ఉపశమనం

పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి మంచి ఉత్తీర్ణత సాధించాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోరు. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలసిన శరీరానానికి నిద్ర ఎంతో ఉపశమనం ఇస్తుందని, ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

పోషకాహారం కీలకం..

పోషకాహారం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోక పోతే అనేక అనర్థాలు కలుగుతాయి. చదివింది గుర్తుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. – 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments