
మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ధనాన్ని సాధ్యమైనంత వరకు పొదుపు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి .వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గృహారంభం చేయగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ముందుకు వెళ్తారు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. డాక్యుమెంట్ రైటర్స్ కి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిధున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా కొంత చికాకు ఏర్పడుతుంది. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి . వృత్తి వ్యాపారములలో నష్టాలు వచ్చే సూచనలున్నవి. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచడం వలన లాభపడతారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తను వింటారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని ఒడిదొడుకులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదు అనే భావన కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి . పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అస్తమ శని నడుస్తుంది. రాబడి బాగుంటుంది. సహోదరీ సహోదరుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది జాగ్రత్త వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. కొద్దికాలం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఏదో ఒక శనివారం శనికి డైలాగు శకం చేయించండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెడు అలవాట్లకు స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది చదువుపై శ్రద్ధ వహించండి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధిత విష వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయ. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి కష్టపడి చదవాలి. చదువుపై శ్రద్ధ వహించండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. ఋణాలు తీర్చగలుగుతారు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం రోజున ఎరుపు వత్తులతో సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులా రాశి వారికి ఈ వార మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యక్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా వస్తుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారి పోతాయి. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. క్రెడిట్ కార్డులకి పర్సనల్ లోన్లకి దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మంచి లాభాలు అందుకుంటారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నలుగురిలో మీ ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి దుర్ వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి లాగే వారు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. మంగళవారం శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు._ప్రతి విషయంలో కూడా గోప్యత అవసరం. వ్యాపారంలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టపడతారు. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. భూ వివాదాలు తీరుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభం రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రతి విషయంలో క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. పునర్ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తోంది. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి హోటల్ వ్యాపారస్తులకు మంచినీటి వ్యాపారం చేసేవారికి అంచు లాభాలు ఉంటాయి. ఆర్ధిక విషయంలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. అహంకారపూరితమైన ధోరణి అవలంబించవద్దు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. శనికి తైలాభిషేకం చేయించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.




