Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedనకిలీ నంబర్ ప్లేట్...వాహనదారుడిపై క్రిమినల్ కేసు

నకిలీ నంబర్ ప్లేట్…వాహనదారుడిపై క్రిమినల్ కేసు

నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తిని లంగర్‌హౌస్ పోలీసులు అరెస్టు చేశారు.వాహనం యొక్క అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులుగా నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తిపై లంగర్ హౌస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని మాసబ్‌ట్యాంక్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్ వ్యాపారం చేస్తున్నాడు. తన వాహనం హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ నంబర్ 13 ఎఫ్‌ఏ 0954కు బదులుగా టిఎస్ 13 ఈఎక్స్ 3358 నంబర్‌పేట్ పెట్టుకుని నగరంలో తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు ట్రాఫిక్ చలాన్లు వేసి ఇంటికి పంపిస్తున్నారు. అసలు వాహన యజమానికి 12 ట్రాఫిక్ చలాన్లు వచ్చాయి. దీంతో ఆ నంబర్ గల వాహనం యజమాని షేక్ ఇమ్రాన్ తన వాహనంపై

అక్రమంగా ట్రాఫిక్ చలాన్లు వస్తున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు, నిందితుడు తన హోండా యాక్టివా వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్ టిఎస్ 13 ఎఫ్‌ఏ 0954కు బదులుగా, టిఎస్13 ఈఎక్స్ 3358 నంబర్ ప్లేట్‌ను వాడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్ ) సెక్షన్లు 318(4), 319(2), మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 158 r/w 177 కింద కేసు నమోదు చేశారు. ఎవరైనా తమ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానిస్తే, వెంటనే ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments