
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని నేషనల్ హైవే టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను ని లిపివేయాలని జాతీయ రహదారుల అధారిటీ సంస్థ ఆలోచిస్తోంది. పూర్తిగా డిజిటల్ చెల్లింపులనే అనుమతిస్తారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, జాతీయ రహదారుల ప్రయాణికులు టో ల్ చెల్లింపులకోసం ఫాస్ట్ ట్యాగ్, లేదా యుపిఐ వంటి డిజిటల్ మోడ్ ల ద్వారా మాత్రమే ఉపయోగించాలి. టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపునకు అవకాశం ఉండే మార్గాలు ఉండవు.




