Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedరాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: క్యాతన్‌పల్లిలో దొడ్డిదారిన అధికారం లాక్కునేందుకు మంత్రి వివేక్, పోలీసుల ముందే తమ దళిత, గిరిజన మహిళ కౌ న్సిలర్లపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం ఆక్షేపణీయమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజ్యాంగం చేతిలో పె ట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్టపగలే ప్రజా తీర్పు ను కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడర ని, కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అని, రేపు మళ్ళీ బీఆర్‌ఎస్ రాగానే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పని, ఎవరూ కాపాడలేరని, ఉద్యమకారుడు బాల్క సుమన్‌పై ప్రభుత్వ కక్ష సాధింపు అక్రమంగా అరెస్ట్ చేసి 200 కిలోమీటర్ల దూరంలో ని ఆదిలాబాద్ జైలుకు తరలించడం దు ర్మార్గమన్నారు. బీజేపీ నాయకులు పోలీసులను బూతులు తిట్టిన అరెస్టులు ఉం డవు కానీ ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నాయకుల పైనే అక్రమ కేసులా అని హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజ సమని ప్రశ్నించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ వాళ్లను అ క్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గమన్నారు.

క్యాతన్‌పల్లిలోని 22 స్థానాల కు గానూ 14 స్థానాలను బీఆర్‌ఎస్ గె లుచుకుందని, బీఆర్‌ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారన్నారు. ప్రజ లు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదన్నారు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారన్నారు. అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళ కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, నోటితో చెప్పలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడి జరుగుతున్నప్పుడు వివేక్ మంత్రి హోదాలో అక్కడే ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడం, కోరం ఉన్న ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం శోచనీయమన్నారు. క్యాతన్‌పల్లి మహిళ కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం ఫిర్యాదు తీసుకోలేదన్నారు. కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజిరెడ్డి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారు. బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేశారన్నారు.

పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గూండాలు స్టేషన్‌కు వచ్చి మరీ కొడుతున్నారన్నారు. ఈ రకమైన దాడులు మంచివి కావని హితావు పలికారు. పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రజల్లో విశ్వాసం నింపాలి కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు చేశారన్నారు. ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. జనగామలో ఓటింగ్ కోసం తమ కౌన్సిలర్ చేతి పైకెత్తితే వెనుక నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. అందులో దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. ఒక ఎంపీ అన్యాయంగా రెండోసారి తొర్రూరులో ఓటు నమోదు చేసుకుని ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగే మున్సిపాలిటీలు గెలిచిందని, తాము ఇప్పుడు దాదాపు 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నామని, అప్పుడు తాము ఇలా చేయలేదన్నారు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. దొడ్డిదారిన పదవులు దక్కించుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారని, కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

కాంగ్రెస్ నాయకుడు బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టిన ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్‌తో రివ్యూ చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడికి పోయిన చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే అని అడిగారు. తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరని, రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడలాని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పైన గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని, పోలీసు అధికారులకు మేము చెప్పేదొకటే.. అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. కాలం మారుతుంది, రేపు బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పోస్టింగ్‌ల కోసం నాయకుల చెప్పుచేతల్లో పనిచేయకూడదన్నారు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్‌ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హరీష్‌రావు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments