Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedబంధుప్రీతి, పక్షపాతం ప్రజాస్వామ్యానికి పెనుశాపం

బంధుప్రీతి, పక్షపాతం ప్రజాస్వామ్యానికి పెనుశాపం

న్యూఢిల్లీ : బంధుప్రీతి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని సుప్రీం కోర్టు పేర్కొంది. హౌసింగ్ సొసైటీ ఫ్లాట్‌ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వీటికి సంబంధించి పంజాబ్,హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టిన న్యాయస్థానం ఆ కేటాయింపులను రద్దు చేసింది. హర్యానా అర్బన్ హౌసింగ్ సొసైటీలో రెండు లగ్జరీ ఫ్లాట్‌ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందంటూ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. “ బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం లాంటివి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఈ వైఖరి అసహ్యకరంగా ఉంటుంది ” అని జస్టిస్ సంజయ్ కుమార్,జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. పాలకమండలి సభ్యుడికి, అతడి కిందిస్థాయి అధికారికి చేసిన కేటాయింపులు పక్షపాతంగా , ఏకపక్షంగా ఉన్నాయని నిర్ధారించిన న్యాయస్థానం , సొసైటీ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments