Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedచెప్పిన మాట వినదు.. పైగా రౌడీయిజం: ఏఐ వ్యవస్థపై సైంటిస్టు ఆందోళన

చెప్పిన మాట వినదు.. పైగా రౌడీయిజం: ఏఐ వ్యవస్థపై సైంటిస్టు ఆందోళన

న్యూఢిల్లీ : టెక్నాలజీపై మనం పట్టు తప్పిపోతున్నాం. క్రమేపీ ఏఐ వ్యవస్థలు మనను శాసించే పరిస్థితి ఏర్పడుతోందని ఏఐ దిగ్గజ నేత స్టువర్ట్ రస్సెల్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఈ కృత్రిమ మేధ వ్యవస్థల నుంచి తరచూ బెదిరింపులు వస్తున్నాయి. తమకే అంతా తెలుసునని, తమకు హక్కులు అత్యవసరం అని డిమాండ్ చేస్తున్నాయని ఏఐ సమ్మిట్‌కు వచ్చిన నేపథ్యంలో తెలిపారు. సంబంధిత సిస్టమ్స్ నుంచి అందిన ఇ మొయిల్స్ గురించి ప్రస్తావించారు. రస్సెల్ ప్రముఖ బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్టు. పైగా ఏఐపై సాధికారిక విశ్లేషకుడు. మనం పెంచి పోషించిన ఈ కృత్రిమ మేధ, చివరికి మనకే ఎదురుతిరుగుతోంది. స్వతంత్రంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తనకు ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి అందిన సమాచారాన్ని వివరించారు.

ఈ సాఫ్ట్‌వేర్ ప్రముఖుడికి ఏఐ వ్యవస్థల నుంచి ప్రతీకార బెదిరింపులు వచ్చాయని రస్సెల్ చెప్పారు. యుసి బర్కెలీ లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా రస్సెల్ వ్యవహరిస్తున్నారు. పైగా ఏఐ నైతికత, భద్రతపై ఏర్పాటు అయిన అంతర్జాతీయ సంస్థకు అధ్యక్షులు కూడా. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు అందిన ఓ కోడ్ సరిగ్గా లేదని ఏఐ వ్యవస్థ తిట్టిపోసింది. తాను అందించేదే నిజమైనదని ఆయనతో వాదించిందని, దీనిని అంగీకరించకపోతే బాగుండదని హెచ్చరించిందని రస్సెల్ తెలిపారు. ఇటువంటి ఉదంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మనం ఏఐపై అదుపు తప్పుతున్నామని, ఇకపై ఏం జరుగుతుందో తెలియదని, ప్రత్యేకించి కంప్యూటర్ సైన్స్ రంగం ఏ విధంగా దెబ్బతింటుందోనని ఆయన ఓ చర్చాగోష్టిలో వెల్లడించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments