Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఈ నెల 18న ఢిల్లీకి సిఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 18న ఢిల్లీకి సిఎం రేవంత్‌రెడ్డి

ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరు

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహిస్తోన్న ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సోమవారం ఘనంగా ప్రారంభ మైంది. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) వల్ల కలిగే మార్పులు, అవకాశాలు, సవాళ్లపై ప్రపంచ స్థాయి చర్చలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎఐ వినియోగం, భద్రత, సహకారం కోసం ఒక ఉమ్మడి మార్గదర్శకాన్ని ప్రకటించడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యంగా ఉంది. ఉద్యోగాల్లో వస్తున్న మార్పుల నుండి పిల్లల భద్రత వరకు ఎఐ ప్రభావం చూపే అన్ని కీలక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 30 దేశాల నుండి 2.5 లక్షల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్ సహా 13 దేశాలు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి.

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు భారత్‌లో దాదాపు 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ సదస్సు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్, ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలు ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును ప్రపంచ ఎఐ వేదికపై బలంగా వినిపించాలని భారత్ భావిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments