
మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
వాషింగ్టన్ : ఈ నెల 9న అమెరికాలోని బర్కిలీలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆయన మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సాకేత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నాడు. 9వ తేదీన చివరిసారిగా క్యాంపస్ సమీపంలోని లేక్ అంజా వద్ద కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతని జాడ తెలియలేదు. స్నేహితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సమీపంలోనే అతని పాస్ట్‌పోర్టు, ల్యాప్‌టాప్, బ్యాగ్‌తో అక్కడే అతడి మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలిఫోర్నియాలో భారత కాన్సులేట్ కూడా సాకేత్ మృతిని ధృవీకరించింది.




