
టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ మరో గెలుపు నమాదు చేసింది. రెండో మ్యాచ్‌లో వెప్టిండీస చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది సూపర్ 8లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లోనూ స్కాట్లాండ్ నుంచి సవాల్ ఎదుర్కొంది. స్టార్ ఆటగాళ్లు విఫమైనా టామ్ బ్యాంటన్(63 నాటౌట్) అద్భుత న్నింగ్స్‌తో గెట్టెకింది. ఇక చివరి 19వ ఓవర్లో విల్ జాక్స్ (16 నాటౌట్) 4, 6 బాదడంతో 5 వికెట్ల తేడాతో గెలిచింది. లీగ్ దశలో రెండోవిజయంతో సూపర్ 8 అవకాశాల్ని మెరుగు పరుచుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వగా.. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌కు గట్టిపోటినిచ్చింది స్కాట్లాండ్.
కానీ, టామ్ బ్యాంటన్ విరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ గెలుపులో కీలకభూమిక పోషించాడు. 153 పరుగుల ఛేదనలో తొలి ఓవర్లోనే మెక్‌ముల్లెన్ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(2)ను ఔట్ చేసి ఇంగ్లంగ్ పతనాన్ని శాసించాడు. రెండో ఓవర్లో జోస్ బట్లర్(3) సైతం డగౌట్ చేరగా.. బ్యాంటన్, జాకబ్ బెథెల్(32) మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇరువురిని అద్భుత డెలివరీతో డేవిడ్సన్ విడదీశాడు. బెథెల్ ఔటయ్యాక.. హ్యారీ బ్రూక్(4), సామ్ కరన్(28) సాయంతో బ్యాంటన్ పోరాడి స్కాట్లాండ్ ఆశలపైనీళ్లు చల్లాడు. 17 బంతుల్లో 15 పరుగులు అవసరమైన దశలో విల్ జాక్స్(16 నాటౌట్) ఇంగ్లండ్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.




