Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedకాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారని, ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజానీకానికి రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. శుక్రవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయమన్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు – రెండేళ్ల ఇందిరమ్మ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా ఆయన అభివర్ణించారు. పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు – ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ విజయం కొనసాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారని మున్సిపల్ ఫలితాలు రుజువు చేశాయన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments