
నమీబియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. దీంతో ఈ మెగా టోర్నీలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. దీంతో నమీబియాపై 93 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. దూబె, బుమ్రా, హర్షదీప్ లు తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (61, 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), హార్దిక్ పాండ్యా(52, 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) భారీ షాట్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.




