
మన తెలంగాణ/సిటీ బ్యూరో: అక్రమణలపై హైడ్రా సీరియస్‌గా స్పందిస్తుంది. పార్కులు, చె రువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా హై డ్రా వ్యవహరిస్తోంది. మంగళవారం.. ఒకేరోజు నగరం నలువైపులా నాలుగుచోట్ల భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలను తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది. రెండుచోట్ల 1,100ల చ.గ.ల మేర ఉన్న పార్కులను కాపాడగా.. మరో రెండు ప్రాంతాల్లో 12 ఎకరాల మేర చెరువుల ఎన్టీఎల్ ప్రాంతాలను హైడ్రా ర క్షించింది. ఇలా కాపాడిన భూమి విలువ సు మారుగా రూ.1,511ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కొండాపూర్‌లో చెరువును కాపాడిన హైడ్రా. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. 4 ఎకరాల జంగంకుంటను పూడ్చేసి.. మట్టితో చదును చేసి ప్లాట్లు గా విక్రయించేందుకు సిద్ధమైన కబ్జాదారుల ఆ ట కట్టించింది హైడ్రా. ఇటీవల మీడియాలో వ చ్చిన కథనాల మేరకు రెవెన్యూ అధికారులతో హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసింది.
జంగంకుంటగా హైడ్రా నిర్ధారించుకుంది. కబ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఫెన్సింగ్ వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువు వద్ద 8 ఎకరాల మే ర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎన్టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కడ పని వారికోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతున్నారని పే ర్కొన్నారు. చెరువు ఎన్టీఎల్ పరిధిలోని టెంటు సామగ్రికి చెందిన 4 షట్టర్లు కూడా వేసినట్టు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని తొలగించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహెబ్‌నగర్ కలాన్‌లోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఈ మేరకు మంగళవారం అక్రమణలు తొలగించి.. పార్కు చు ట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. మల్కాజిగిరి జోన్, మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయనగర్‌లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును హైడ్రా కాపాడింది.




