Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedవార ఫలాలు (08-02-2026 నుండి 14-02-2026 వరకు)

వార ఫలాలు (08-02-2026 నుండి 14-02-2026 వరకు)

మేష రాశి ఫలితాలు :

మేష రాశి వారికి ఈ వారం ఆదాయం తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న పాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదే బాగుంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉంటారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు చేసే కృషి ఫలిస్తుంది. పదిమందిలో మెప్పు పొందే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే మాట్లాడుతారో ముక్కుసూటిగా ఉంటుంది అది అందరికీ నచ్చదు. ఈ రాశి వారు ఏది మాట్లాడినా తప్పు అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పై అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించిన విషయాలలో వారి చదువుపట్ల ఆచితూచి అడుగు వేయటం మంచిది. ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

ఫిబ్రవరి నెల 17 వరకు శుక్ర మౌడ్యమి ఉంది కాబట్టి 18వ తేదీ నుండి శుభముహూర్తాలు ఉన్నాయి చక్కగా వివాహ ప్రయత్నాలు నూతన గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా స్ట్రెస్ కు లోన్ అవటం వలన ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. బీపీ షుగర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు వాటి పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ రాశి వారు సంకల్పబలంతో ముందుకు వెళ్ళటం మంచిది. అంతేకానీ ఈ పని అవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉంటే ఏ పని నెరవేరదు. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లు చాలా చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే డాక్టర్ సలహాలు తీసుకొని జాగ్రత్త పడటం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం హనుమాన్ చాలీసా పఠించండి కుదిరితే ఒకరోజు సుందరకాండ పారాయణం ఇంట్లో చేయించుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ లభించే అవకాశం గోచరిస్తుంది. పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పదిమంది పలు రకాలుగా చెప్తారు ఏది మంచో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అదేవిధంగా అధికారులతో కొంత ఇబ్బంది ఉండే అవకాశం గొచరిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. శుభకార్య ప్రస్తావన ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన వ్యవహారాలు బాగుంటాయి. అయితే సంతానం ఉద్యోగం పట్ల కొంత నిరాశ ఏర్పడుతుంది. చేతిదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది. కాస్మటిక్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్స్ కి సివిల్ సర్వీసెస్ లో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది.

నూతన వ్యాపారాల ప్రారంభోత్సవం నూతన వాహనాలకు కొనుగోలు ఎక్కువగా గొచరిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. పేరు ప్రఖ్యాతల విషయంలో ఎలాంటి ఇబ్బంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ కాలం గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఏదైనా సరే కష్టపడి వెళ్లాల్సి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఫ్రెండ్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కష్ట కాలంలో మీకు ఎవరూ తోడు ఉండరు కాబట్టి పెద్ద వాళ్ళ మాట విని శ్రద్ధగా చదువుకోవడం మంచిది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారంపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య రీత్య కూడా అన్ని సానుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడంలో మంచి శుభవార్త వింటారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. గృహప్రవేశం చేయాలనే కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఖర్చులు విషయంలో మాత్రం జాగ్రత్త వహించడం మంచిది. ప్రతిరోజు సుబ్రమణ్య స్వామి అష్టకం చదవండి అలాగే సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లు ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధున రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. రావలసి ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చేతికి అందుతాయి. రాహు ప్రభావం వలన మనసు పరిపరి విధాలుగా ఉండటం, ఏ పని చేసినా సరే హడావిడిగా చేయటం, పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తతో మాట్లాడటం చేయాలి. పై అధికారులతోటి జాగ్రత్త పడటం చెప్పదగిన సూచన. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గడచిన కాలం కంటే కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది . కొన్ని కార్యక్రమాల పట్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఖర్చులు అదుపులోకి వస్తాయి భూ సంబంధిత విషయ వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. మీ స్నేహితుల అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. లాయర్లకి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కాని మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఖర్చులు అదుపులో ఉండవు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయం మనకే తెలుసు ఎవరు చెప్పనవసరం లేదు అనే ధోరణి అవలంబించకండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. మీరు రాసుకు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా గడిచిన వారం కంటే బాగుంటుందని చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినీ కళా రంగాలలోని వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సుబ్రహ్మణ్యం పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం కొంత అప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. నూతన కాంట్రాక్టులు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రావలసిన బెనిఫిట్స్ లభిస్తాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది చదువుపై శ్రద్ధ వహించండి. విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం ఆడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాజు వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడుల నుండి రాబడి రావడం మొదలు అవుతుంది. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి మంచి సంబంధం కుదురుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ కి దూరంగా ఉండండి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై తగిన శ్రద్ధ వహించాలి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాజు వారు ప్రతి రోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి వీసా పాస్పోర్ట్ లభిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు గ్రే.

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. సమాజ సేవలో మీ వంతు సహకారం అందిస్తారు. గో సేవ చేయండి. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయవిక్రయాలలో లాభపడతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి లాయర్లకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి నిత్యవసర సరుకులు అమ్మేవారికి ఈవారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రాజు వారు పెద్ద రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఇంద్రాణి రూపం మెడలో ధరించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వస్తే రంగు స్కై బ్లూ. ఇదే నా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సహోదరీ సహోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. వ్యవసాయదారులకు ప్రేరేచరంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్స్ నడిపే వారికి ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలువ అనుకూలంగా ఉంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై తగిన శ్రద్ధ వహించాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార పరంగా రొటేషన్సు బాగుంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవండి సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసివచ్చ సంచే ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా అధికారుల అండదండలు లభిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది తక్కువగా ఉంది అనే బాధ కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితి ఆసాజనకంగా ఉంటుంది. వ్యాపార పరంగా తొందరపాటు పనిచేయదు. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ధనం సరైన సమయంలో చేతికందక ఇబ్బంది పడతారు. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. కొన్ని వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. ఈ రాశి వారు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతో అమ్మ వారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఇదేనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. 

కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో తక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉదర సంబంధిత వ్యాధులు గైనకాలజికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శని కళా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. సాహిత్య రంగంలో ఉన్నవారికి అవార్డు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. సంతాన పురోగతి బాగుంటుంది. వివాహ సంబంధమైన విషయాలలో కొంత ఆలస్యం ఏర్పడుతుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments