Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedబెల్లంపల్లి గురుకుల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

బెల్లంపల్లి గురుకుల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు భో జనం చేసిన తరువాత అస్వస్థతకు గురికావడంతో పుడ్ పాయిజన్ జ రిగి ఉంటుందనే వాదనలు వినవస్తున్నాయి. శుక్రవారం రాత్రి బెల్లంపల్లి వసతి గృహాంలో విద్యార్థులు భోజనం చేసిన తరువాత 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులను బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఆసుపత్రి కి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చి కిత్స అందించారు. గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ గురుకులాలపై ప్రభుత్వ వైఖరీ తెలియజేస్తుందని విద్యార్థుల పేరేంట్స్ అన్నారు. గురుకులాలలపై సక్రమైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే తరచు పుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతుండడం దురధృష్టకరం, ఇప్పటికే పలు ప్రాంతాలలో గురుకులాలలో పుడ్‌పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చేరిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికి, బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో సంఘటన జరగడం

నిర్లక్ష్యానికి దారితీస్తుందనడంలో ఏలాంటి సందేహాం లేదు.ఈ సంఘటన తెలిసిన ఎంఎల్‌ఎసి మల్క కొంరయ్య శనివారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించారు. పుడ్ పాయిజన్ సంఘటనను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో సంఘటన విషయమై ఛరవాణిలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బెల్లంపల్లి గురుకుల పాఠశాల లో జరిగిన పుడ్ పాయిజన్ విషయమై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేసారు. ప్రతి సారి గురుకుల పాఠశాలలో పుడ్‌పాయిజన్ ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు, అధికారుల పర్యవేక్షణ ఎందుకు కొరవడుతుందని, ఈ విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. పుడ్ పాయిజన్ సంఘటనపై రిపోర్టు హెల్త్ డైరెక్టర్ కు పంపాలని ఆయన ఆదేశించారు. గురుకులం ఘటనకు బాద్యులను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. విద్యార్థులకు ఏలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments