
ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026లో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. శనివారం పసికూన యుఎస్‌ఎ(యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజ యం సాధించి, బోణీ కొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టమీండియా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 నాటౌట్ (49 బంతులు; 10×4, 4×6) తప్ప మరెవరూ రాణించలేకపోయారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అమెరికా బౌలర్లలో షాడ్లీవాన్ షాక్విక్(4/25), హర్మీత్ సింగ్(2/26), అలీ ఖాన్(1/13), మహమ్మద్ మోహ్సిన్(1/16) తలో వికెట్ తీసి, భారత బ్యాటర్లను వణికించారు. అనంరతం లక్ష ఛేదనకు దిగిన యుఎస్‌ఎ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. మలింద్ కుమార్(34), సంజయ్ కృష్ణమూర్తి(37), శుభం రంజనె(37) మాత్రమే రాణించారు. భారత్ బౌలర్లల్ మహ్మద్ సిరాజ్ (3/29), అర్ష్‌దీప్ సింగ్(2/18), అక్షర్ పటేల్(2/24)లు చెరేగి భారత్ గెలుపులో కీలక భూమిక పోషించారు.




