
భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశా లోని చాందీపూర్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజిలో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్షాలు అన్నిటినీ ఈ క్షిపణి సాధించిందని పేర్కొంది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థం, యుద్ధ సన్నద్ధత, మరింత పెరిగిందని పేర్కొంది. అగ్ని సిరీస్‌కు సంబంధించి భారత్ వద్ద వివిధ రకాల క్షిపణులు ఉన్న విషయం తెలిసిందే. అగ్ని1 క్షిపణి 700కిమీ దూరంలో లక్షాలను, అగ్ని2 క్షిపణి 2 వేల కిమీ, అగ్ని3 క్షిపణి 3 వేల కిమీ దూరం లోని లక్షాలను సాధించగలవు. అగ్ని 4 నాలుగువేలకిమీ, అగ్ని 5 అత్యధికంగా 5 వేల కిమీ దూరంలో లక్షాలు సాధిస్తాయి. ఇక అగ్ని1 క్షిపణితో 220కిమీ కనిష్ఠ దూరం లోని లక్షాలను కూడా ధ్వంసం చేస్తాయని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 150300 కిమీ దూరం లోని లక్షాలను ఛేదించే పృద్వి సిరీస్ క్షిపణులకు అనుబంధంగా అగ్ని1 క్షిపణిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నాయి. మరోవైపు వివిధ దేశాలు అగ్ని క్షిపణులపై ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటికోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి.




