
ఎన్నికల సంఘం తమిళనాడు రాష్ట్ర ఓ టర్ల హక్కులను తనిఖీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రాజ్యసభలో బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన తమిళనాడులో కొనసాగుతోన్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకియపై మాట్లాడారు. “ రాష్ట్రంలో త్వ రలో జరిగే ఎన్నికల గురించే నా ఆందోళన. దా న్ని అక్షరదోషాలు తనిఖీ చేసే ప్రక్రియగా భావిస్తున్నా. ఓటు ప్రాథమిక హక్కు. ఎన్నికల కమిషన్ మాత్రం మా హక్కును తనిఖీ చేస్తోంది. జాబితా పరిశీలనల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు కోటి మంది అర్హులైన ఓటర్లు చనిపోయినవారి జాబితాలో ఉండవచ్చని ఆందోళన చెందుతున్నాం.
బీహార్‌లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాం” అని అన్నారు. భా ష గురించి మాట్లాడుతూ తనకు తమిళ ఉపాధ్యాయులు భాషను పరిచయం చేశారని, తమ భాష, సంస్కృతిపై జరిగే ఎటువంటి దాడినైనా ఎదుర్కోవాలని సీఎన్ అన్నాదురై తదితర నేతల నుంచి నేర్చుకున్నానని అన్నారు. హైస్కూలు మధ్యలో చదువు మానేసిన తాను ఆర్థిక శాస్త్రంపై మాట్లాడేందుకు అర్హుడని కాదని ఎవరనుకున్నా అభ్యంతరం లేదని, తాను మాత్రం మాట్లాడుతానని స్ప ష్టం చేశారు. తమిళుడిగా తనకు ఓ స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాలను నే టి యువత నిశితంగా గమనిస్తోందన్నారు.




