
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురవడం కలచివేసిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో నిత్యం కలుషిత ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, పాము కాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మొద్దు నిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను గాడినపెట్టాలని, పాము కాటుకు గురైన అస్మితకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.




