Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedరష్యన్ వనితల వల్ల బిల్‌గేట్స్‌కు లైంగిక వ్యాధి

రష్యన్ వనితల వల్ల బిల్‌గేట్స్‌కు లైంగిక వ్యాధి

అమెరికాలో లైంగిక నేరస్థుడుగా తేలిన జెఫ్రీ ఎప్‌స్టిన్ కార్యకలాపాలకు సంబంధించి ఎప్‌స్టిన్ ఫైల్స్ పేరుతో అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసిన వీడియోలు, చిత్రాలుతో సహా పత్రాలు సంచలనం కలిగిస్తున్నాయి. న్యాయశాఖ ఎప్‌స్టిన్ పేరుతో 3000 వీడియోలు, 1,80,000 చిత్రాలతోపాటు 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను విడుదల చేసింది. ఇందులో టెస్లా అధినేత మస్క్‌పై తాజా ఆరోపణలతోపాటు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌పై కూడా సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మన్దూనీ తల్లి మీరా నాయర్ పేరును కూడా చేర్చడం గమనార్హం.

బిల్‌గేట్స్ రష్యన్ మహిళలతో శారీరకంగా, సంబంధాలను కలిగి ఉన్నాడని, దీంతో లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధి (ఎస్‌టిడి) బారిన పడ్డారని, పేర్కొంది. ఆ తర్వాత తన భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వడానికి యాంటీబయోటిక్స్ కోరాడని ఆరోపించింది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ఈమెయిల్స్ 2013 జులై 18 నాటివి. ఎపిస్టిన్ డ్రాఫ్ట్ సందేశాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని గేట్స్ అప్పటి సలహా దారు బోరిస్ నికోలిక్ గొంతులో ఉన్నాయి. వాటిలో గేట్స్, “ రష్యన్ అమ్మాయిలతో నిద్రపోతున్నాడని, లైంగిక సంక్రమణ వ్యాధి బారిన పడ్డారని, దీంతో మెలిండా గేట్స్‌కు “ రహస్యంగా ” ఇవ్వగల యాంటీ బయోటిక్స్ కోసం అడుగుతున్నాడని ఎపిస్టీన్ ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఈమెయిల్స్‌ను డిలీట్ చేయమని గేట్స్ కోరాడని కూడా ఈ మెయిల్స్ సారాంశం.

తీవ్రంగా ఖండించిన బిల్‌గేట్స్

ఈ ఆరోపణలపై గేట్స్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా వాస్తవ దూరమైనవని,అసంబద్ధమైనవని, గేట్స్ ప్రతినిధి డైలీ మెయిల్‌తో అన్నారు. ఈ ఆరోపణలు ఎప్‌స్టీన్ ఫ్రస్ట్రేషన్‌కు నిరాశకు తార్కాణమని అతని ఉచ్చులో చిక్కుకోవడానికి పరువు తీయడానికి ఎంత దూరమైనా వెళ్లాడని ఆరోపించారు.

జోహ్రాన్ మమ్దానీ తల్లిపై ఆరోపణలు

మరోవైపు ఈ ఆరోపణలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి, చిత్ర నిర్మాత, మీరా నాయర్ పేరు కూడా చేర్చారు. 2009 అక్టోబరు 21 న ప్రచారకర్త పెగ్గీసిగల్ జెఫ్రీ ఎపిస్టీన్‌కు పంపిన ఇమెయిల్ , దర్శకులు మీరా నాయర్ తన సినిమా ఆఫ్టర్ పార్టీలో ఉన్నారని వెల్లడించింది. లైంగిక అక్రమ రవాణాదారు, దోషిగా తేలిన గిస్లయిన్ మాక్స్‌వెల్ ఇంట్లో జరిగిన 2009 నాటి మూవీ “ అమేలియా” ఆఫ్టర్ పార్టీకి హాజరయ్యారని ఆరోపించిం ది. ఈ పార్టీకి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా హాజరయ్యారని పేర్కొంది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments