Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedభారత్ నుంచి అమెరికా నేతలకు అందిన బహుమతులు ఇవే..

భారత్ నుంచి అమెరికా నేతలకు అందిన బహుమతులు ఇవే..

న్యూయార్క్: విదేశీ పర్యటనలకు భారత నేతలు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు గౌరవ పూర్వకంగా బహుమతులు తీసుకుని వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. 2024 క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ప్రధాని మోడీతో సహా భారత్‌కు చెందిన నేతలు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఇతర నేతలకు ఏయే బహుమతులను అందించారో ఆ జాబితాను ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. 2024లో బైడెన్‌కు మోడీ బహూకరించిన “స్టెర్లింగ్ సిల్వర్ మెటల్ ట్రైన్ సెట్, మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు బహూకరించిన కశ్మీర్ పాష్మినా షాల్, యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ప్రధాని మోడీ అందజేసిన“ లార్డ్ కృష్ణ రాస్ లీలా సిల్వర్ బాక్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. 480.00 అమెరికా డాలర్ల విలువ గలిగిన వీటన్నిటినీ నేషనల్ ఆర్కైవ్స్‌లో భద్రపరిచినట్టు తెలుస్తోంది.

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి లాయిడ్ జస్టిన్‌కు బహూకరించిన నటరాజ కాంస్య విగ్రహం, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అప్పటి అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల అధ్యక్షుడి సహాయకుడు జాకబ్‌కు ఇచ్చిన బహుమతులు వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2023 లో ప్రధాని మోడీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు ఇచ్చిన గంధపు చెక్కతో చేసిన ఒక పెట్టె, స్కార్ఫ్, కుంకుమ పువ్వు, టీపొడి ఉన్న చెక్కపెట్టె, ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్స్ అనువాద పుస్తకం వివరాలు కూడా ఇందులో ఉన్నాయని యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది. వీటిలో గంధపు చెక్క పెట్టె, స్కార్ఫ్ , మరో చెక్క పెట్టె ఇవన్నీ యూఎస్ నేషనల్ ఆర్కైవ్స్‌లో భద్ర పర్చినట్టు వివరించింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments