
వేంసూరు మండల పరిధిలోని చౌడవరం గ్రామంలో మహిళపై ఆదివారం రాత్రి కత్తితో దాడి చేసిన సంఘటన జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందిన పత్తి పరుపు రాఘవమ్మ పై అదే గ్రామానికి చెందిన గట్ల శివ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి చేసిన మరుక్షణమే అతను పరారైనట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన రాఘవమ్మను ఆమె కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గట్ల శివ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.రాఘవమ్మకు ఖమ్మం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స చేయిస్తున్నారు. ఆమె బంధువులు గ్రామస్తులు బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని, శివను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.




