
మల్టీ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌ మిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈషా రెబ్బా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఈ రీమేక్ సినిమాలో మన తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో పాత్రల్లో చాలా మార్పులు చేశారు. ఇందులో ఉండే భావోద్వేగాలు అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటా యి. నాకు శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తెరపై మీకు ఓంకార్ నాయుడు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మంచి సమ్మర్‌లో ఈ సినిమా షూటింగ్ చేశాము. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఒక సీన్ చేశాము. నాకు నీళ్లంటే భయం. ఆ సీన్ చేస్తున్నప్పుడు నిజంగా భయపడ్డాను. అయితే ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు సజీవ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు”అని అన్నారు.




