
వాషింగ్టన్: మంచుతుపాన్ ఉధృతితో అమెరికాలో ఆదివారం పదివేలకు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో సర్వీసులకు జాప్యం ఏర్పడింది. దేశంలోని అత్యంత రద్దీగల విమానాశ్రయాలు మంచుధాటికి నిర్మానుష్యం అయ్యాయి. దేశ వ్యాప్తంగా 18 కోట్ల మంది వరకూ మంచు తుపాన్, భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నారు. న్యూయార్క్ , బోస్టన్ ఇతర ప్రాంతాల్లో 1 నుంచి రెండు అడుగుల వరకూ మంచు పేరుకుపోయింది.




