
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకు ని దక్షిణ మధ్య రైల్వే వివిధ నగరాల మధ్య వన్‌వే స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఈ నెల 26న తిరుపతిహైదరాబాద్ (07505), మచిలీపట్నంకాచిగూడ (07506) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. విశాఖపట్నంచర్లపల్లి (08517), చర్లపల్లివిశాఖపట్నం (08518) ప్రత్యేక రైళ్లు ఈ నెల 25, 26 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపిం ది. తిరుపతి సికిందరాబాద్ ప్రత్యేక రైలు రేణిగుంట, రాజంపేట్, కడప, యర్రగుంట్ల, గూటీ, గుంటకల్, ఆదోని, రాయిచూర్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేంగంపేట్ స్టేషన్లలో ఆగుతుంది. మచిలీపట్నంకాచిగూడ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ, గుంటూర్, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుం ది. విశాఖపట్నంచర్లపల్లి ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామల్కోట్, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూర్, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.
వీక్లీ స్పెషల్ ట్రైన్స్ కాలపరిమితి పొడిగింపు
ప్రయాణీకుల రద్దీ దృష్టా వివిధ నగరాల మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే వాటి కాలపరిమితిని మరికొంత కాలం పొడిగించింది. ప్రతి సోమవారం నడిచే కాచిగూడమధురాయి రైలును ఫిబ్రవరి 2 నుండి 23 వరకు, ప్రతి బుధవారం నడిచే మధురాయికాచిగూడ రైలు కా లపరిమితిని ఫిబ్రవరి 4 నుండి 25 వరకు, ప్రతి శనివారం నడిచే హైదరాబాద్కొల్లాం ప్రత్యేక రైలును ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 21 వరకు, ప్ర తి సోమవారం నడిచే కొల్లాంహైదరాబాద్ ప్రత్యేక రైలును ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 23 వరకు, ప్రతి బుధవారం నడుపుతున్న హైదరాబాద్కన్యాకుమారి ప్రత్యేక రైలును ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 25 వరకు, ప్రతి శుక్రవారం నడుపుతున్న కన్యాకుమారిహైదరాబాద్ ప్రత్యేక రైలును ఫిబ్రవరి 6 నుండి 27 వరకు, ప్రతి బుధవారం నడుపుతున్న నర్సాపూర్తిరువన్నమలై ప్రత్యేక రైలును ఫిబ్రవరి 4 నుండి 25 వరకు, ప్రతి గురువారం నడుపుతున్న తిరువన్నమలైనర్సాపూర్ ప్రత్యేక రైలు కాలపరిమితిని ఫిబ్రవరి 5 నుండి 26 ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు ద.మధ్య రైల్వే తెలిపింది.




