Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedతల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడి దుర్మరణం

తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడి దుర్మరణం

నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తల్లితో కలిసి స్కూటీపై స్కూలుకు వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆర్మీ వాహనం కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన నీలాంగ్ తమాంగ్ (32) తన కుమారుడు నిజేన్ తమాంగ్ (8) ను స్కూటీపై ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు తీసుకెళ్తోంది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వారు ఆఫీసర్స్ కాలనీ రోడ్డుపై ఆర్మీ వాహనం పక్కగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు స్కూటీ స్కిడ్ అయింది. దీంతో తల్లి, కుమారుడు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఆర్మీ అశోక్ లేలాండ్ వాహన డ్రైవర్ ఈ విషయాన్ని గమనించే లోపే కింద పడిన నిజేన్ తమాంగ్ పైనుంచి ముందు చక్రం దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో నీలాంగ్ తమాంగ్‌కు కూడా గాయాలు కాగా,

ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తాత (నీలాంగ్ మామ) రాజు తపా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్మీ వాహనం అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు వెళ్లే సమయంలో మహిళలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అజాగ్రత్త అనాలోచిత నిర్ణయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని రోడ్డుపై వాహనాలతో వచ్చేవారు పూర్తి జాగ్రత్తతో మసులుకోవడం అత్యంత అవసరమని పలు సిసి కెమెరాల పుటేజీలు తెలుపుతున్నాయి. విద్యాలయాలకు వెళ్లే వచ్చే సమయాలలో భారీ వాహనాలను స్కూల్లో ప్రాంగణాలలో అనుమతించకపోవడం అమల్లో ఉన్నప్పటికీ ప్రమాదం జరగడం అత్యంత విచారకరమని పలువురు భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments