Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedదమ్మపేటవద్ద ప్రైవేటు బస్సు బోల్తా

దమ్మపేటవద్ద ప్రైవేటు బస్సు బోల్తా

దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కె.వి.ఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లికి తరలించారు. చీకట్లో హాహాకారాలు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఏం జరుగుతుందో తెలియక బాధితులు హాహాకారాలు చేశారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారు లు వెంటనే స్పందించి కిటికీలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చే రుకుని పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రై వర్ ప్రాథమికంగా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో పన్నుల ఎగవేత. ప్రమాదానికి గురైన బస్సు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఏ ఆర్ 01 జే 4434 కలిగి ఉండటం గమనార్హం. పన్నులు తక్కువగా ఉం టాయనే కారణంతో ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా సర్వీసులు నడుపుతున్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం పర్యాటక పర్మిట్ ఉన్న బస్సులు కేవలం టూరిస్టులను మాత్రమే తీసుకెళ్లాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆపరేటర్లు సామాన్య ప్రయాణికుల నుంచి టికెట్లు వసూలు చేస్తూ ప్యాసింజర్ సర్వీసులు నడుపుతున్నారు. ఈ బస్సుపై ఇప్పటికే 14 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల వాహనాలు నెల ల తరబడి ఇక్కడే తిరుగుతున్నా స్థానిక రవాణా శాఖ అధికారులు తనిఖీలుచేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments