
జివిఎంసి పారిశుధ్య కార్మికురాలు మానవత్వం చాటుకున్నారు. రోడ్డుపై తనకు దొరికిన బంగారాన్ని బాధితులకు అప్పగించిన సంఘటన విశాఖ పట్నంలోని మదధురవాడ పరిధి పిఎం పాలెంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెలితే.. పారిశుధ్య కార్మికురాలు అరుణ, రాము, స్వచ్ఛ వామనం డ్రైవర్ ప్రసాద్ బుధవారం ఉదయం విధులు నిర్వహించారు. ఆ సమయంలో వారికి రోడ్డుపై రూ.5 లక్షల విలువైన 4.5 తులాల రెండు బంగారు నెక్లెస్ లు దొరికాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు సమచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివారాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ లో భాగంగా పిఎం పాలెంలోని రాజగోపాల్ రెసిడెన్సీలో ఉంటున్న రామచంద్రరావు, సౌమ్యకి చెందినవిగా పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం పారిశుధ్య కార్మికుల సమక్షంలో బంగారు ఆభరణాలను పోలీసులు వారికి అప్పగించారు.




