
గూడ్స్ రైలు అదుపు తప్పి పట్టాలు తప్పిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద చోటు చేసుకుంది. గూడ్స్ రైలు నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున రెండు పాల ట్యాంకర్ బోగీలు పక్కకు జరిగాయి. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.




