
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అయిజ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే… స్థానికుల కథనం ప్రకారం.. అయిజ పసట్టణ శివారు కర్నూలు టు రాయచూర్ వెళ్ళే రహదారి పై ఉప్పల క్యాంపు వద్ద సునీల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు గాయపడిన సునీల్ ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




