
భారత్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ సిరీస్‌ను11తో సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలి వన్డేలో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కివీస్ 47.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. విల్ యంగ్ (87)తో కలిసి డారిల్ మిఛెల్ న్యూజిలాండ్‌కు విజయం సాధించి పెట్టాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మిఛెల్ 117 బంతుల్లోనే 11 ఫోర్లు, రెండు సిక్స్‌లతో అజేయంగా 131 పరుగులు చేశాడు. అతనికి ఫిలిప్స్ 32 (నాటౌట్) సహకారం అందించాడు.
శుభారంభం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. రోహిత్ సమన్వయంతో ఆడగా గిల్ దూకుడును ప్రదర్శించాడు. అయితే 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన రోహిత్‌ను క్రిస్టియన్ వెనక్కి పంపాడు. దీంతో 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్ది సేపటికే గిల్ కూడా ఔటయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 56 పరుగులు చేశాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ (8) కూడా ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి (23) పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో భారత్ 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది.
రాహుల్ అజేయ శతకం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ తనపై వేసుకున్నాడు. అతనికి రవీంద్ర జడేజా అండగా నిలిచాడు. అతని సహకారంతో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. జడేజా (27) పరుగులు వెనుదిరిగాడు. నితీశ్ కుమార్ (20) అండతో రాహుల్ పోరాటం కొసాగించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 92 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 112 పరుగులు చేశాడు. దీంతో భారత్ మెరుగైన స్కోరును నమోదు చేసింది.




