
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ద్వారకా నగర్ లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లయోలా డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రుతిక (19) సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.తరచూ ఫోన్ మాట్లుతుందని రుతికను తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరు లేని సమయం లో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయం తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాంను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.




