Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedబుధవారం రాశి ఫలాలు (14-01-2026)

బుధవారం రాశి ఫలాలు (14-01-2026)

మేషం

ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తివివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం

బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం

గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

కన్య

వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలం వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

తుల

సోదరులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.

వృశ్చికం

కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమునశుభకార్యాలు నిర్వహిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతం చేస్తారు.

ధనస్సు

నూతన వాహన యోగమున్నది. సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

మకరం

వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు.నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువర్గంతో మాటపట్టింపులుంటాయి.

కుంభం

వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలిసిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవ కార్యక్రమాలలోపాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.

మీనం

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments