
అంకారా: ఇస్లామిక్ నాటో కూటమికి రంగం సిద్ధం అయింది. పాకిస్థాన్, సౌదీ అరేబియాల ఇటీవలి సంయుక్త రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ ఇస్లామిక్ నాటో ఏర్పాటు అవుతుంది. ఇందులో చేరేందుకు ఇప్పుడు టర్కీ కూడా సిద్ధం అయింది. టర్కీ ఇప్పుడు నాటో సభ్యదేశంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ వెలువరించిన వార్త ప్రకారం అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్న పాకిస్థాన్ , సౌదీ అరేబియాలు కుదుర్చుకున్న ఒప్పందంలో టర్కీ కూడా భాగస్వామ్యం అయితే భారత ఉపఖండంలో ఇది కీలక పరిణామం అవుతుంది.
రెండు దేశాలతో టర్కీ సంప్రదింపులు పురోగతి దశలో ఉన్నాయి. డీల్ కుదురుతుందని వెల్లడైంది. పాక్, టర్కీ, సౌదీల రక్షణ బంధం స్పష్టం అయితే మిడిలిస్టులో ఇది భద్రతా రక్షణ విషయాలలో సమతూకతలను మార్చే పరిణామం అవుతుంది. ప్రత్యేకించి భారత్‌కు సవాలుగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. టర్కీ పలు సందర్భాలలో పాకిస్థాన్‌కు మద్దతు పలికింది. గత ఏడాదిలో భారత్‌పై సైనిక దాడికి పాకిస్థాన్‌కు అత్యంత అధునాతనమైన 360 సైనిక డ్రోన్లను సమకూర్చింది. అమెరికా సారధ్యపు నాటోలో కూడా టర్కీ సభ్యదేశంగా ఉంది. అయితే అదనంగా తమకు ప్రత్యేక భద్రతా కూటమి అవసరం అని టర్కీ అభిప్రాయపడుతోంది.




