
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టన పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిం చారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా, సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అత్యంత బలమైన వాదనలు వినిపించాలని ఆయన లీగల్ టీమ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఇతర రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగ కుండా దిగువన ఉన్న రాష్ట్రంగా మిగిలి ఉన్న వరద నీటిని వాడుకునే హక్కు ఎపికి ఉందని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది సుమారు 3,000 టిఎంసిల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, అందులో కేవలం 200 టిఎంసిలను మాత్రమే వినియో గించుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రాజె క్టును ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఈ నీటిని కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి తరలించి, ఆ ప్రాం తాన్ని సస్య శ్యామలం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్రా నికి సమ ర్పించామని, వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం డిపిఆర్ కోసం పిలిచిన టెండర్లు కేవలం ముంద స్తు సన్నాహక చర్య లు మాత్రమేనని, చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరి గేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




