Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసేన విభాగం నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేరుతో ప్రకటన విడుదలైంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో పార్టీ ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న జనసైనికులు, వీర మహిళలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments