
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) సిఒడి పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపా రు. స్వ తంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతి పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే కావటం గొప్ప విషయం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విజ యం కోసం కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, కార్మికు లు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ ముందు చూపుకు, దార్శనికతకు 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విజయగాథ నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని, మిగులు వి ద్యుత్తు రాష్ట్రంగా నిలిపి, రాష్టంలో వెలుగు జిలుగులు నింపిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.
తెలంగాణ చరిత్రపై కెసిఆర్ చేసిన మరో చెరగని సంతకం యాదాద్రి థ ర్మల్ పవర్ స్టేషన్ అని, దీన్ని తుడిచేయలేరు, చెరిపేయలేరని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా భవిష్యత్ తె లంగాణకు దారి దీపం యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అని తెలిపారు. రా బోయే కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రంలోని ప్రజల, రైతుల విద్యుత్ అవసరాలను తీర్చడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని చెప్పా రు. కెసిఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అనే కురచ బుద్ధిని, కుళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి.. రాష్ట్ర రైతాంగం, తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా యాదాద్రి థర్మల్ పవ ర్ ప్రాజెక్ట్‌లో మిగిలిన రెండు యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి, కమర్షియల్ ఆపరేషన్‌లోకి తేవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది
తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతు న్నది, పోలీసు రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం పై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగు లు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నెలల తరబడి విద్యార్థులు, ని రుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూ స్తుంటే సిఎం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగు ల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభు త్వానిదన్నారు. ఎన్నికలకు ముందు అ శోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొ ర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుని, అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మో పి తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసి నా, బెదిరింపులకు పాల్పడినా చూస్తూ ఊ రుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




