
చార్మింగ్ స్టార్ శర్వా… రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’నారి నారి నడుమ మురారి’ జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. మంగళవారం విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ’భల్లే భల్లే’ విడుదలైంది. ఇది యంగ్ లవ్ లోని హ్యాపీనెస్ ని చూపిస్తోంది. హరిచరణ్ పాడిన, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంటుంది. శర్వా, సాక్షి పాత్రల మధ్య వుండే కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఒక విజువల్ ట్రీట్‌లా వుంది.




