
మన తెలంగాణ/హైదరాబాద్:ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఐపిఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారా వు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏ ర్పాటైన జోన్లు, ఇతర విభాగాలకు చెంది న 20 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తున్న ట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సౌత్ జోన్ అడిషనల్ కమీషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్, నార్త్ డిసిపిగా ఎన్. శ్వేత, సిద్దిపేట కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎం వి జయ్‌కుమార్ హైదరాబాద్ స్పెషల్ జా యింట్ కమిషనర్‌గా, ఎన్ కోటి రెడ్డి నూ తనంగా ఏర్పాటు చేసిన కుత్భుల్లాపూర్ జోన్ డిసిపిగా, ఎన్.నారాయణరెడ్డి మ హేశ్వరం జోన్ డిసిపిగా, రక్షిత కె. మూ ర్తి సికింద్రాబాద్ జోన్ డిసిపిగా, కె. సురే ష్ కుమార్ ఉప్పల్ జోన్ డిపిసిగా, కారే కిరణ్ ప్రభాకర్ చార్మినార్ జోన్ డిసిపిగా, బి. అనురాధా ఎల్‌బి నగర్ జోన్‌డిసిపిగా, యోగేష్ గౌతమ్ చేవెళ్ల జోన్ డిసిపిగా, రి తిరాజ్ కూకట్ పల్లి జోన్ డిసిపిగా, సిహె చ్. శ్రీనివాస్ శేరిలింగంపల్లి జోన్ డిసిపి గా, సదానంద రష్మి పెరుమాళ్ సిద్దిపేట కమిషనర్‌గా, సిహెచ్. శ్రీధర్ మల్కాజ్‌గిరి జోన్ డిసిపిగా, కె. శిల్పవల్లి ఖైరతాబాద్ జోన్ డిసిపిగా, ఎస్.శ్రీనివాస్ రాజేంద్రనగర్ జోన్ డిసిపిగా, జి.చంద్రమోహన్ గొల్కొండ జోన్ డిసిపిగా, ఏ. రమణా రెడ్డి జూబ్లీహిల్స్ జోన్ డిసిపిగా, రాజేష్ శం షాబాద్ జోన్ డిసిపిగాబదిలీ అయ్యారు.




