
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతతో ఢిల్లీ లోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో సోమవారం సాయం త్రం అడ్మిట్ అయ్యారు. సోనియా గాంధీ శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ చాలా కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఢిల్లీలో వాయు కా లుష్యం పెరిగిన ప్రతిసారీ ఆమె ఇబ్బందులు పడవలసి వస్తోంది. ఇప్పుడు కూ డా ఢిల్లీలో చలి తీవ్రతతోపాటు కాలు ష్యం భారీగా పెరగడంతో సోనియా అ స్వస్థతకు గురయ్యారు.




