
తెలంగాణ అసెం బ్లీ సమావేశాలు మంగళవారం రాత్రి 10.20 గం టలకు నిరవధికంగా వాయిదా ప డ్డాయి. ఐదు రోజుల పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మొత్తం 40 గంటల 45 నిమిషాల పాటు సభ్యులు చర్చ చేశారు. మొత్తం 32 ప్రశ్నలో ప్రశ్నోత్తరాల సమయంలో 66 మంది సభ్యులు సభలో చర్చించారు. రెండు తీర్మానాలు చేయగా 13 బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. ఆమోదం పొందిన బిల్లుల్లో తెలంగాణ పురపాలికల (నాలు గో సవరణ)బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్(సవరణ) బిల్లు, హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్(రెండో సవరణ) బిల్లు, తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల(స్థాపన, క్రమబద్ధీకరణ) బిల్లు,
తెలంగాణ మోటారు వాహనాలపై పన్ను విధింపు(సవరణ), తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ ఎపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ పేస్ట్రక్చర్ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఎమెండ్మెంట్) బిల్లులు ఉన్నా యి. 4 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయి దా పడింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన మండలిలో పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. మొత్తం నాలుగు బిల్లులను ఆమోదించారు. అనంతరం సాయం త్రం ఐదు గంటల తర్వత సభను స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. ఐదు రోజుల పాటు శాసనమండలి కొనసాగింది. మొత్తం 19 గంటల 52 నిమిషాల పాటు మండలి సాగింది.




