
సౌతాఫ్రికా19తో యూత్ వన్డే సిరీస్
బెనొనీ: భారత చిచ్చరపిడుగు, అండర్19 ఆటగాడు వైభవ్ సూర్యవంశి మరోసారి చెలరేగిపోయాడు. 10 సిక్సర్లు బాది 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి భారత యువ జట్టుకు మరో విజయాన్ని అందించాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు యూత్ వన్డేల సిరీస్‌తో భాగంగా సోమవారం జరిగిన రెండో యూత్ వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత్ బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ నాలుగు వికెట్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించగా.. ఆర్ఎస్ అంబ్రిష్ రెండు, దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోలోయి విజయం సాధించింది. వైభవ్ సూర్యవం శి(68), అభిగ్యన్ కుండు(48)లు బ్యాట్‌తో రాణించడంతో 23.3 ఓవర్లలోనే డిఎల్ఎస్ ప్రకారం నిర్ణయించి లక్షాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత అండర్19 టీమ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 20తో సిరీస్ కైవసం చేసుకుంది.




