
ఢాకా: భారత్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ టీమ్‌ను ఆదివారం ప్రకటించారు. బంగ్లా జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రహ్మాన్‌కు జట్టులో స్థానం దక్కింది. మరో ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్‌కు కూడా జట్టులో చోటు కల్పించారు. స్టార్ స్పిన్నర్లు మెహదీ హసన్, రిషాద్ హుస్సేన్‌లు కూడా వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యారు. అయితే బంగ్లా టీమ్‌లో చాలా మంది కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించడం విశేషం.
జట్టు వివరాలు:
లిటన్ దాస్ (కెప్టెన్), తంజీద్ హసన్, పర్వేజ్ హుస్సేన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, ఖాజీ నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషాద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తఫిజుర్ రహ్మాన్, షరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్.




