
మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం గతం కంటే కూడా బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వచ్చిన ధనాన్ని పొదుపు చేస్తారు. మీకు కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలలో. వైవాహిక జీవితంలో సానుకూలమైన మార్పులను చూస్తారు. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వాహనయోగం ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. ప్రతి పనిలో కూడా మీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించండి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి టీచింగ్ స్రీలు ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. కుటుంబ పరంగా నూతన ఆలోచనలను అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేయి దాటిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎరుపు. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.
మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలి అని ఆలోచనలు వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు ఇంతకాలం పొదుపు చేసిన ధనం కూడా ఖర్చు అవుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. చేపట్టిన పనుల్లో కొన్ని అవాంతరాలు కలుగుతాయి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. అలాగే ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుంటుంది. ఖర్చుల విషయంలో చాలావరకు జాగ్రత్త వహిస్తారు. వ్యాపార పరంగా రాబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి. రాజకీయ రంగంలో రాణిస్తారు. వ్యాపార పరంగా అంచనాలను దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏర్పడిన అవరోధాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. సుబ్రమణ్య పాశుపత రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. పాత బాకీలు వసూలు అవుతాయి. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. బంధుమిత్రులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించి రుణాలు చాలా వరకు తీరుస్తారు. ఉద్యోగ పరంగా అధికారుల మెప్పు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది ఆర్థిక భారం తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. ఎనిమిది మంగళవారాలు సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గుత్తి ఉద్యోగాలలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోతాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలలో పెద్ద వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ముందుకు వెళ్ళవద్దు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. రుద్ర పాశుపత హోమం చేయించండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి కొన్ని పనులు పూర్తి కావు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే కొంత కాలం వేచి ఉండండి. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ పరంగా అదరపు బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు వస్త్రాలు. ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు, మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. బంధు వర్గంతో ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవిత ఆశయం నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ౬ కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా ఉన్నత పదవికి ఎంపిక అవుతారు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానపరమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. రాజకీయరంగంలో రాణిస్తారు. సినీ కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దూరపుంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గుత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. సమాజ సేవలో పాల్గొంటారు. గో సేవ చేస్తారు. ఒక స్థిరాస్తిని అమ్మేసి రుణాలు తీరుస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. వ్రాసి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభ రాశి వారికి వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. కెరియర్ పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి డైలాగ్ చేయించండి ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ పరంగా పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి మీరు ఆశించిన రీతిలో ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. షేర్ మార్కెట్ కి స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకోండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తారు. . దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. సహా ఉద్యోగులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం మరియు హనుమాన్ చాలీసా చదవండి. నలుపు వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు
సంప్రాప్తిస్తాయి.




