
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళలకు బైక్ డ్రైవింగ్, కారు డ్రైవింగ్‌లో ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ట్విట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బైక్ టాక్సీ, ఈ -ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తీసుకున్న వారికి ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ జారీలో సహాయం చేయనున్నారు. డ్రైవింగ్ అనుభవం లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
వాహనం లోన్, లీజు సౌకర్యం కల్పించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహిళలు మాత్రమే అర్హులు. కాగా, వారి వయస్సు 21 నుంచి 45 ఏళ్లు ఉండాలి. అర్హత ఉన్న మహిళలు, యువతులు జనవరి 3వ తేదీన అంబర్‌పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సంప్రదించాలి లేదా 8978862299కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.




